విద్యావ్యవస్థలోని పరిణామాలపై మంత్రి కేటీఆర్ మరోమారు స్పందించారు. గతంలో ఓ చిన్నారి రొట్టెముక్కతో స్కూళ్లో నిలబడిన ఫోటోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ మరోమారు అదే రీతిలో స్పందించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి చదువుతో సతమతమవుతున్నాం…మా బాల్యాన్ని కాపాడండి అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అభిజిత్ కార్తిక్ అనే విద్యార్థి ‘సర్..నాపేరు అభి. కేపీహెచ్‌బీలోని నారాయణ టెక్నో స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్ టైమింగ్ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. దీనికి తోడుగా ఐఐటీ తలనొప్పి ఒకటి. సోమవారం ఉన్న ఐఐటీ ఓరియంటేషన్ క్లాసులు మా ఆదివారం ఆనందాన్ని చంపేస్తోంది. మా బాల్యాన్ని కాపాడండి. దయచేసి కఠినంగా వ్యవహరించండి’ అంటూ ట్వీట్ చేశారు.
