తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల ,అన్ని మతాల వారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ సంస్థ చైర్మన్ డా.పిడమర్తి రవి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజక వర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .
ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవులకు క్రిస్మస్ కానుక ఇస్తున్నారు .అందులో భాగంగా పిడమర్తి రవి నియోజక వర్గంలో కల్లూరు మండలంలో మండల కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ కానుక కింద క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ,మతాల వారి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుంది .నియోజక వర్గంలో అన్ని వర్గాల వారికీ అన్ని వేళల అండగా ఉంటూ నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో నియోజకవర్గాన్ని జిల్లాలో నెంబర్ వన్ అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతాను అని ఆయన అన్నారు .