పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభను స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభను వెంకయ్యనాయుడు ప్రారంబించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుశ్యంత్ చౌతాలా ఇవాళ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు. ఆకుపచ్చ రంగులో ఉన్న ట్రాక్టర్‌పై ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. అయితే గేటు వద్దే ఆయన వాహనాన్ని ఆపేశారు.హర్యానా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలా మనువడే దుశ్యంత్ చౌతాలా. పార్లమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయసు కలిగిన ఎంపీ కూడా దుశ్యంత్ కావడం విశేషం.
