బొగ్గు స్కాంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయనకి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యాయి. దీంతో ఈ కేసులో నేరపూరిత కుట్ర, అవినీతి, మోసానికి పాల్పడినట్లు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, మాజీ బొగ్గు కార్యదర్శి హరీష్ చంద్ర గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎ.కె.బసు, మరొక వ్యక్తిని దోషులుగా పేర్కొంటూ బుధవారం ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రికి కోర్టు జైలు శిక్ష విధించడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.