‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ జనవరి లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కంబోలో
వస్తున్నా‘అజ్ఞాతవాసి’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగిత దర్శకుడు. అనిరుద్ సంగీతంలో కొలవేరి పాట ప్రపంచ వ్యాప్తంగా ఏంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ టాలీవుడ్‌కి నేరుగా పరిచయమవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.కాగా, ఇదే సంక్రాంతికి అనిరుద్ సంగీతమందిస్తున్న మరో చిత్రం కూడా రాబోతోంది. అదే సూర్య హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘తానే సేరంద కూట్టమ్’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొంగల్‌కి రిలీజ్ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అనువాదం కానుంది. సో.. 2018 సంక్రాంతికి అనిరుద్ డబుల్ ధమాకా ఇవ్వనున్నాడన్నమాట. అంతేగాక ఈ రెండు చిత్రాల్లోనూ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండడం విశేషం. మరి చూడలి ఈ రెండు సినిమాలు అనిరుద్ కు తెలుగులో ఎటువంటి సంగితం అందించాడో.
