Home / POLITICS / ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు “కాకా” స్వప్నం..మంత్రి హరీష్

ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు “కాకా” స్వప్నం..మంత్రి హరీష్

ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు” కాకా” వెంకట స్వామీ చలవేనని రాష్ట్ర ఇరిగేషన్,మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లో దివంగత జి.వెంకటస్వామి మూడవ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.అయితే అప్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ నీళ్ళు లభ్యత ఉన్న మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైను చేశారని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి కా బోతోందని ’కాకా’ కు అదే నిజమైన నివాళి అని మంత్రి అభిప్రాయపడ్డారు. గత పాలకులు నీళ్లను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఉరుకున్నారని’ కా కా’ మాత్రం వై. ఎస్.ని ధిక్కరించారని చెప్పారు.”కాకా”వెంకట స్వామి కలను త్వరలోనే సాకారం చేయబోతున్నట్టు చెప్పారు.

Image may contain: 10 people, people smiling, people standing and flower

‘కాకా’ అన్ని పదవులు అధిష్టించారని అయినా అహంభావం లేకుండా సామాన్య ప్రజలు, కార్మికుల తోనే ఆయన నిరాడంబరంగా తిరిగారన్నారు.శక్తి వంతమైనకార్పొరేట్ లాబీయింగ్ ను తట్టుకొని కార్మికులకు పెన్షన్ పథకం అమలు జరిగేలా పోరాడారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ‘కాకా’కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.’కాకా’ ను అత్యున్నతంగా గౌరవించుకోవాలని ట్యాంక్ బండ్ పై కాక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తు చేశారు. ఆయన స్మారకంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్రభుత్వంచేపడుతుందని హరీష్ రావు చెప్పారు.విద్యార్థులుసోషల్ మీడియాకు, వాట్స్ అప్ కు స్వస్తి చెప్పి పుస్తకాల వైపు దృష్టి మరలిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని అభిప్రాయపడ్డారు.పట్టుదల ఉంటే సాధించలేనిది లేదన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ సాధన కోసం 2001 లో ఉద్యమించిన సమయం లో చాలా మంది హేళన చేశారని కానీ పట్టుదలగా 14ఏళ్లపాటు శ్రమించి తెలంగాణ సాధించారని హరీశ్ రావు గుర్తు చేశారు.వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ లా కాలేజ్ఆల్ఇండియాలో 25వ స్థానం లో ఉండటం గర్వ కారణం అని మంత్రి అన్నారు.

Image may contain: 21 people, people smiling, people standing

కేంద్ర మంత్రిగా ఉన్న ‘కాకా’ కుటుంబ సభ్యులకు క్రమశిక్షణ, సంస్కారం నేర్పారని చెప్పారు. నలుగురికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దారని పొగిడారు.ఈ రోజు ‘కాకా’ మన మధ్య లేకపోవడం తీరని లోటు అన్నారు.తెలంగాణ ఉద్యమం లో ఎం.పి.గా డాక్టర్ వివేక్ తెరవెనుక ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిన విషయం చాలా మందికి తెలియదని హరీశ్ రావు తెలిపారు.కీలక సందర్భాల్లో ‘కాకా’కుమారులు వివేక్, వినోద్ చక్రం తిప్పినట్టు హరీశ్ రావు తెలిపారు.ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రాంతానికి ‘కాకా’మేలు చేశారని చెప్పారు.బతికుండగా తెలంగాణ రాష్ట్రాన్ని సంధించాలనేది కాకా కోరిక అని , ఆ కోరిక నెరవేరాకే తుది శ్వాస విడిచారన్నారు.కాకా చాలా అదృష్టవంతుడని తెలిపారు.

Image may contain: 5 people, people smiling, people standing and wedding

2004 లో కాంగ్రెస్ తో పొత్తులో కాకా కీలక పాత్ర వహించారని మంత్రి చెప్పారు.జనం మధ్య, జన నేతగా పేదల పక్షపాతిగా మెలిగిన వ్యక్తి ‘కాకా’అని అన్నారు.’కాకా’కృషి కారణంగా సింగరేణి కాలరీస్ తెలంగాణకు దక్కిందన్నారు.80 వేల మంది నిరు పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చిన వ్యక్తిగా,నాయకునిగా’కాకా’చిరస్మరణీయుడని హరీశ్ రావు తెలిపారు.2002 నుంచి 2014 వరకు కాకా తో తనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. వెంకట స్వామి ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారన్నారు.తెలంగాణ కోసం బులెట్ దెబ్బలు తిన్న వ్యక్తి కాకా అని హరీష్ కొనియాడారు. కెసిఆర్ పోరాట పటిమ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.కెసిఆర్ పట్టుదలతో తెలంగాణ సాధించారని,విద్యార్థులు కూడా పట్టుదలతో తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.ఫేస్ బుక్ , వాట్స్ అప్ లను వదిలిపెదితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు మంత్రి హితవు పలికారు.ఇప్పుడు తల దించుకొని ఫేస్ బుక్, వాట్స్ అప్ లలో మునిగిపోతే తరువాత తల దిన్చుకోక తప్పదని అన్నారు.ఉన్నతమైన టార్గెట్లు పెట్టుకొని జీవితంలో ఉన్నత స్థానాల్లోకి రావాలని కోరారు.

Image may contain: 5 people, people standing

Image may contain: 21 people, people smiling, people standing

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat