Home / SLIDER / పెనుప్రమాదంగా మారిన బ్లూ వేల్ గేమ్..!

పెనుప్రమాదంగా మారిన బ్లూ వేల్ గేమ్..!

బ్లూ వేల్ యొక్క పేరు వింటేనే ఇప్పుడు అందరి గుండెల్లో వణుకు పుట్టుకొస్తోంది . బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మ‌నం మాట్లాడు కోవ‌డానికి ఓ పేద్ద రీజనే ఉంది. ఈ గేమ్ బారిన ప‌డి చాలా మంది చిన్నారులు త‌మ ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. ఈ గేమ్ బారిన ప‌డి ర‌ష్యా, యూకే లో ఇప్ప‌టికే దాదాపు 130 మంది చిన్నారులు త‌మ ప్రాణాల‌ను తీసుకున్నారు.

ఈ గేమ్ మొదటగా సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది.ర‌ష్యా లో ప్రారంభ‌మైన ఈ గేమ్ ఇప్పుడు ఇండియాను పాకింది. నీలి తిమింగ‌లం చాలెంజ్ గేమ్ ను ఓ సోష‌ల్ మీడియా గ్రూప్ ర‌న్ చేస్తుంటుంది. ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాల‌నుకునే వాళ్లు.. గేమ్ నిర్వాహ‌కులు చెప్పినట్లు చేయాలి. 50 రోజులు వాళ్లు  ఇచ్చే టాస్కులు చేస్తూ ఉండాలి.

ముందు ఓ పేప‌ర్ పై తిమింగ‌లం బొమ్మ గీయాలి. త‌ర్వాత త‌మ శ‌రీరంపై దాని బొమ్మ వేసుకోవాలి. ఆ త‌ర్వాత హార్ర‌ర్ సినిమాలు చూడటం. అర్ధ‌రాత్రులులేవ‌డం.. న‌డ‌వ‌టం లాంటి టాస్కులు ఈ గేమ్ లో ఉంటాయి. అలా 50 రోజులు 50 టాస్కులు పూర్తి చేసిన త‌ర్వాత సూసైడ్ చేసుకోవాలి. దీన్నే సెల్ఫ్ డిస్ట్రాయింగ్ అంటారు. గేమ్ విన్ అవాలంటే ఖ‌చ్చితంగా సూసైడ్ చేసుకోవాల్సిందేన‌ని నిర్వాహ‌కులు గేమ్ ఆడేవాళ్ల‌పై ఒత్తిడి తెస్తారు. దీంతో.. గేమ్ గెల‌వాల‌న్న ఆరాటంతో త‌మ‌ను తాము చంపుకుంటున్నారు చిన్నారులు.అయితే చిన్నారుల ఆత్మహత్య కారణమవుతున్న ‘బ్లూ వేల్’పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది . అత్యంత ప్రమాదకరమైన ఈ ఆటకు సంబంధించిన లింకులను వెంటనే తొలగించాలని వెబ్‌సైట్లకు ఆదేశాలు జారీ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat