Home / MOVIES / అనుష్క పొలిటిక‌ల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్‌..!!

అనుష్క పొలిటిక‌ల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్‌..!!

సూప‌ర్ చిత్రంతో తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో అడుగుపెట్టిన అనుష్క ప్ర‌స్తుతం వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. ఓ వైపు స్టార్‌ల స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తూ.. మ‌రో వైపు గెస్ట్ రోల్స్‌లో న‌టిస్తూ.. అంతేగాక లేడీ ఒరియంటెండ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది స్వీటి అనుష్క‌.

అయితే, లేడీ ఒరియంటెడ్ చిత్రంగా రూపొందుతున్న భాగ‌మ‌తి చిత్రంలో అనుష్క కీ రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్‌పై, పిల్ల జ‌మీంద‌ర్ ఫేమ్ అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా వంశీ, వినోద్ ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌లు సినీ జ‌నాల‌ను ఎంతగానో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అరుంధ‌తీ త‌ర‌హాలో ఈ చిత్రం ఉంటుంద‌ని సినీ జ‌నాలు అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు. ఈ చిత్రంలో అనుష్క‌ది డ్యూయ‌ల్ రోల్ అని, అందులో ఒక క్యారెక్ట‌ర్ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంద‌ని స‌మాచారం. అంటే స్వీటీ అనుష్క రీల్ లైఫ్‌లో పొలిటిష‌న్ కాబోతుందంటూ స‌నీ జ‌నాలు కామెంట్లు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino