నూతన సంవత్సర సందర్బంగా నిన్న జనసేన అధినేత , ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్‌ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లాడారు . ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కల్యాణ్ ల భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. పవన్ కల్యాణే …ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు అయన తెలిపారు . రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ గురించి పవన్ ప్రశంసించారని, ఇరవై నాలుగు గంటల కరెంట్… కేసీఆర్ ఘనతేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
