ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, ఇవాళ గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్‌ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇలా గజల్ శ్రీనివాస్ కేసు విచారణ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. గజల్ బాధితురాలు కుమారి, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అసలు స్టింగ్ ఆపరేషన్ ఎలా చేశానో చెప్పుకొచ్చింది. తాను ముందు అనుకున్న ప్రకారం కెమెరాను కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశానని, రూ.3,600లతో కెమెరా బుక్ చేశానని, కెమెరా డెలివరీ అనంతరం ఈ స్టింగ్ ఆపరేషన్‌ను మొదలు పెట్టినట్లు చెప్పింది కుమారి. అంతేగాక తన వద్ద ఎక్కువ నగదు లేకపోవడంతో తన ఫోన్ మెమోరీనే కెమెరాకు ఫిక్స్ చేసినట్లు చెప్పింది.
ఇలా తాను అనుకున్న ప్రకారం.. గజల్ శ్రీనివాస్ పడుకునే ప్రదేశం.. మంచం.. గజల్ శ్రీనివాస్ పీఏ పార్వతి కూర్చొనే ప్రదేశం. ఇలా అన్ని విజువల్స్ కెమెరాలో కనిపించేలా ఫిక్స్ చేశానని, తాను తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక్క రోజులో జరగలేదని, తన ప్రణాళిక అమలుకు ఐదు నెలలుపట్టినట్లు చెప్పింది కుమారి. ఇలా తాను అనుకున్న విజువల్స్ వచ్చేలా కరెక్ట్‌గా కెమెరాను ఫిక్స్ చేశానని వెల్లడించింది. తాను ఫిక్స్ చేసిన కెమెరాలో మొత్తం సుమారు 15 వీడియోలు గజల్ శ్రీనివాస్‌కు సంబంధించి లైంగిక వేధింపుల విజువల్స్ వచ్చాయని, వాటన్నింటినీ పోలీసులకు అందజేశానని చెప్పింది కుమారి.