అనుకున్నది ఒకటి..అయినది ఒకటి ..పాపం కాంగ్రెస్ నేతలకు షాక్ ల పై షాకులు తగులుతున్నాయి..నిన్న సాక్షాత్తు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చేతోలో షాక్ తిన్నారు…వివరాల్లోకి వెళ్తేతెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ, మండలిలో ప్రతిపక్షనాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు నిన్న రాజ్ భవన్ కు వెళ్లి.. రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పిట్లంలో ఇసుక మాఫియా సాయిలు అనే వీఆర్‌ఏని బలిగొన్నదని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు .. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నదని, అందులో భాగంగానే కారెగాంలో వీఆర్‌ఏ హత్య జరిగిందని చెప్పుకొచ్చారు.
అయితే.. సాయిలు మృతిపై పోలీసుల నుంచి అప్పటికే వివరాలు తెలుసుకున్నగవర్నర్ నరసింహన్.. సాయిలు వీఆర్‌ఏ కాదని, రాత్రి సయయంలో భార్యతో గొడవపడి అంబాపూర్‌లోని కూతురు వద్దకు వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందాడని, అతడి మృతిలో ఇసుక మాఫియా హస్తంలేదని చెప్పేసరికి కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నట్టు సమాచారం.
నేరెళ్ల నుంచి కామారెడ్డి వరకు ప్రభుత్వం ఇసుకను మాఫియాకు కట్టబెట్టిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంపై కూడా గవర్నర్ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి కన్పించడం లేదుకదా అని నరసింహన్ పేర్కొన్నట్టు తెలిసింది. అయినా.. ప్రతీ చిన్న విషయానికి ముఖ్యమంత్రిని, మంత్రి కేటీఆర్‌ని టార్గెట్ చేసినట్టు మాట్లాడటం కంటే ఆధారాలు చూపి ఆరోపించాలని వారికి హితవు పలికినట్టు సమాచారం.గవర్నర్ నరసింహన్ ఇంతగా స్పందిస్తారని ఊహించని కాంగ్రెస్ నాయకులు.. బిక్కమొహాలు వేసుకుని రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చారు.