సినీ విమర్శకుడు కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యక్ష వాగ్వాదం చోటుచేసుకుంది. పవన్‌కు పలు ప్రశ్నలు సంధించిన కత్తి మహేష్ ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. అయితే పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు. ‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ ఎందుకు.. మేము చాలు’’ అంటూ అభిమానులు ప్రెస్‌క్లబ్ లోపలికి దూసుకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఫ్యాన్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోసోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తన సొంత కారును వదిలేసి, ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుని ప్రెస్ క్లబ్ కు వచ్చిన కత్తి మహేష్ తనను చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడుతూ, ముందు చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, ఇప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. మరో పది నిమిషాలు లేదా పావుగంట పాటు పవన్ తరఫున ఎవరు వస్తారో చూస్తానని, ఎవరూ రాకుంటే, తాను చెప్పదలచుకున్నది చెప్పి వెళ్లిపోతానని అన్నాడు. తన చాలెంజ్ ని ఎవరైనా స్వీకరిస్తారేమో వేచి చూస్తానని చెప్పాడు.
అనంతరం కత్తి మహేష్ మీడియాతో మాట్లాడుతూ “పవన్ తన ఫ్యాన్స్‌లో ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. జనాలను వాడుకునే బ్రోకర్. కక్షసాధింపు కోసం పార్టీ పెట్టానని ఆయనే స్వయంగా చెప్పాడు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు కోసం కాదు పార్టీ పెట్టేంది. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడితే ఫ్యాన్స్ విరుచుకుపడరు. అయినా ఈయన మాట్లాడారు. పది ప్రశ్నలు వేశాను. ఆయన గురించి సమాధానం చెప్పరు. అలాంటిది ఆయన వ్యక్తిత్వం` అని వెల్లడించారు.