ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 56వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో 56వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.
ఉదయం 10 గంటలకు తలుపులపల్లి గ్రామం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. తిమ్మిరెడ్డిపల్లి , తోటలోపు, టీ రంగం పేట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.
విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకుపాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. అనంతరం రంగంపేట క్రాస్ చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు పూతలపట్టు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తదుపరి సమనత్తం మీదుగా అనంతాపురం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుంది.