అజ్ఞాతవాసి చిత్రం ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ కావడంతో.. పవన్-త్రివిక్రమ్‌లు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలు అందుకున్న ఈ కాంబినేషన్‌కు అజ్ఞాతవాసి రూపంలో ఘోర పరాజయం తప్పలేదు. అందులో దొర్లిన తప్పులను సరిద్దిద్దుకొని ఈసారి భిన్నమైన కథాంశంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం.. ఎన్టీఆర్, వెంకటేష్‌ల చిత్రాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత పవన్‌తో చిత్రం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.అయితే మరో చిత్రం చేయాలనేది ఇప్పటి నిర్ణయం కాదట.. అజ్ఞాతవాసి తెరకెక్కించడానికి ముందే నిర్మాత చినబాబుకు పవన్ మాటిచ్చారని తెలుస్తోంది. ఇక అజ్ఞాతవాసి చిత్రం పై సామన్య ప్రేక్షకులనే కాకుండా, అభిమానులను సైతం తీవ్రంగా నిరుత్సాహపరిచింది.
పవన్ ఇమేజ్‌ను దెబ్బతీసే సినిమా తీస్తావా అంటూ అభిమానులు ఇప్పటికే త్రివిక్రమ్‌పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మరోసారి డేర్ చేస్తారా అనేదే ప్రశ్న. అయితే, ఇండస్ట్రీలో త్రివిక్రమ్-పవన్‌కు ఉన్న బంధం ఇప్పటిదికి కాదు. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు త్రివిక్రమ్ తప్పకుండా దమ్మున్న కథతో వస్తారని మరికొందరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంకో మ్యాటర్ ఏంటంటే.. సినిమాలు ప్లాప్ అవడం.. హీరోలు, నిర్మాతలకు మరో చిత్రం చేస్తానని చెప్పడం మామూలే. గతంలో బ్రహ్మోత్సవం సినిమా కూడా డిజాస్టర్ అయినప్పుడు మహేష్ కూడా ఇలాగే నిర్మాతకు మరో సినిమా చేస్తాడని మాటిచ్చాడు. అయితే ఇప్పుటి వరకు దానికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ జాడ కూడా లేదు. మరి మాటమీద నిలబడే వ్యక్తి అని అంటుంటారు కదా.. మరోసారి త్రివిక్రమ్‌కు చాన్స్ ఇచ్చి నిర్మాతకు న్యాయం చేస్తారో చూడాలి. మరోవైపు ఇప్పటికే అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ అవడంతో త్రివిక్రమ్ పై పీకల దాకా కోపం పెట్టుకున్న పవన్ ఫ్యాన్స్… త్రివిక్రమ్‌తో ఇంకో సినిమా అంటే.. ఎలా రియాక్ట్ అవుతారో అని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.