తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు జపాన్ లో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో ,సీఈఓ ,చైర్మన్లతో వరస భేటీలు జరుపుతున్నారు మంత్రి కేటీఆర్ ..జపాన్ కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకున్నారు .
మరోవైపు టోక్యోలో జరిగిన పలు రకాల కంపెనీలకు చెందిన అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు .వేస్ట్ మేనేజ్మెంట్ ,స్మార్ట్ సిటీ తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జేఎఫ్‌ఈ ఇంజినీరింగ్ సంస్థతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నది .అందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఆ సంస్థ అధికారితో మాట్లాడారు .రెసిస్టార్లు ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్స్ సంస్థతో కూడా ఒప్పందం జరిగింది.