Home / ANDHRAPRADESH / కుప్పంలో మహిళపై నడి బజార్లో బట్టలు ఊడదీసి టీడీపీ నేతలు దాడి … వీడియో !

కుప్పంలో మహిళపై నడి బజార్లో బట్టలు ఊడదీసి టీడీపీ నేతలు దాడి … వీడియో !

సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై కీచకపర్వం సాగినా సంబంధిత బాధితులు పోలీసులకు పిర్యాదు చేసిన ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. గత కొన్ని రోజులకు ముందు  విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అలాంటి కీచకపర్వం పునరావృతమైంది.

ఈ దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన భార్యాభర్తలకు అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కొంతకాలంగా గొడవలున్నాయి. ఇదే విషయాన్ని ఉమ దంపతులు ఇటీవలి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ కుటుంబం వైసీపీకి చెందిందంటూ ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో నిన్న ఉదయం…ఉమ దంపతులు పక్కింట్లోని అవ్వ దగ్గరకు వెళ్తుండగా వారిని చూసిన భాగ్యలక్ష్మి ఉమ్మివేసింది. ఎందుకు ఉమ్మావంటూ ఆ దంపతులు ప్రశ్నించడం నేరమయ్యింది. రెచ్చిపోయిన భాగ్యలక్ష్మి తన బంధువులతో కలసి వారిపై దాడికి తెగబడింది. అంతే కాకుండా జన్మభూమి కార్యక‍్రమంలో తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఉగిపోతూ… ఉమను వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే వివస్త్రను చేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టారు. నోటితో కొరికి దారుణంగా గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చితకబాదారు. స్థానికులు తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతోనే భాగ్యలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat