Home / SLIDER / తెలంగాణ‌కు గుజరాతీ పాఠాలు ఏం అక్క‌ర్లేదు…

తెలంగాణ‌కు గుజరాతీ పాఠాలు ఏం అక్క‌ర్లేదు…

గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత‌, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్‌కు సీఎం కేసీఆర్‌ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామ‌ని…తెలంగాణ లో సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని ఆయ‌న తెలిపారు.

మేవాని కాంగ్రెస్ ఏజెంట్ లా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. గ‌జరాత్ లో దళిత ఉద్యమాన్ని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టాడని…తెలంగాణలో దళితులు చైతన్యశీలురని, ద‌ళిత సంఘాలకు మేవాని పాఠాలు అక్కర్లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.వామపక్ష ముసుగు కప్పుకున్న అంబేద్కరిస్టు మేవాని అని మండిప‌డ్డారు. కమ్యూనిస్టులు అంబేద్కరిస్టుల కలవలేరని పిడ‌మ‌ర్తి అన్నారు. మాయావతి, కాన్షీరాం లు సొంతగా రాజకీయ
పార్టీ స్థాపించి నాలుగుసార్లు యూపీలో రాజ్యాధికారంలోకి రాగలిగారని…మాయావతి లాంటి గొప్ప దళిత  నాయకురాలిని విమర్శిస్తున్న మేవానికి దళితుల మద్దతు లేదని స్ప‌ష్టం చేశారు.

మేవాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రాహుల్ గాంధీ ఆశీర్వాదం తీసుకున్నారు తప్ప దళిత పెద్దలను కలవలేదని పిడ‌మ‌ర్తి ర‌వి పేర్కొన్నారు.కేసీఆర్ దళిత పక్షపాతి అని ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అన్నారు. మేవానికి తెలంగాణ పరిస్థితుల గురించి సరయిన అవగాహన లేనట్టుందని,అందుకే విమర్శలు చేశారనిపిస్తోందని చెప్పారు. మందకృష్ణ అంబేద్కర్ సిద్ధాంతాన్ని గాలికొదిలి భౌతిక దాడులను నమ్ముకున్నారని ఆరోపించారు. మంద కృష్ణ జైల్లోఉన్నా బయట ఉన్నా ఏబీసీడీ వర్గీకరణ పోరాటం ఆగదని స్ప‌ష్టం చేశారు. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మేవానితో భేటీ అవ‌డంపై ర‌వి క్లారిటీ ఇచ్చారు. ఓ దళితుడిగా కలిశారెమో! అని ఆయ‌న అన్నారు. మేవానిని ప్రవీణ్ కుమార్ కలవడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum