సినీ ఇండస్ర్టీలో నిలదొక్కుకోవాలన్నా.. రాణించాలన్నా అంత ఈజీ కాదు. ఇది జగమెరిగిన సత్యం. కష్టం, టాలెంట్, అదృష్టం, డబ్బు ఇలా అన్నీ ఉండాల్సిందే మరీ. ఇప్పుడు సినీ ఇండస్ర్టీని పరిశీలిస్తే.. కొందరు బ్యాక్‌గ్రౌండ్‌తోను.. మరికొందరు టాలెంట్‌తోను.. మరికొందరు అదృష్టంతోను రాణిస్తున్న వారే. బ్యాక్‌గ్రౌండ్ పేరు చెప్పి సినీ ఇండస్ర్టీలో రాణిస్తున్న వారిలో ప్రముఖులు చాలామందే ఉన్నారన్న విషయం అందరికి తెలిసిందే.
ఇక అసలు విషయానికొస్తే.. ఇలా పైన చెప్పిన బ్యాక్ గ్రౌండ్ అనేది తప్ప మిగతా లక్షణాలన్నీ ఉన్నా కూడా రాణించలేకపోతే. అది అతని దురదృష్టమనే చెప్పుకోక తప్పదు. ఆ లిస్టులో మొదటి స్థానంలో ఉంటే నటుడు రాజా రవీంద్ర. ఒకొనొక సమయంలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజారవీందర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేగాక అటు బుల్లితెర, ఇటు వెండితెరపై కూడా రాజారవీంద్ర తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. ఇంతలా నటనలో గుర్తింపు తెచ్చుకున్న రాజా రవీందర్‌కు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. టాలీవుడ్‌లో చిన్న చిన్న హీరోల డేట్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. సునీల్, సందీప్ కిషన్, రాజ్ తరుణ్ వంటి హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు రాజా రవీంద్ర. అయినా రాజా రవీంద్రను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో స్టార్ స్టేటస్‌ను అనుభవించి.. వచ్చిన అవకాశాలను ఉపయోగించకోకుండా చేజేతులా అవకాశాలను చేజార్చుకున్న ఆర్టిస్ట్‌ను ఏమంటారు మీరే చెప్పండి.