అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు ప్రతిపక్షాలు కాదని, ముమ్మాటికీ వారు ప్రగతి విరోధకూలేనని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ నేతలపై విరుచుక పడ్డారు. తెలంగాణ ప్రాంతానికి జీవగడ్డగా మారనున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుకొని విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరించడం వరకు కేసులు వేసి అడ్డుకుంటున్న వారిని ప్రగతి విరోధకులుగా కాకుండా మరేమని సంబోధించాలో ప్రజలే తేల్చి చెప్పాలని అయన పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం పరిదిలోని అత్మకూర్ యస్ మండలం నశింపేట, ఏపూర్ గ్రామపంచాయతీ పరిధి లోని మాన్యతండా, బోడతండా, నాన్యా తండాలకు చెందిన కాంగ్రేస్, టి.డి.పి లకు చెందిన నాయకులు కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. తండాలకూ తండాలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని ప్రకటించారు. పార్టీలో చేరిన వారిని మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మూడున్నర సంవత్సరం కాలంలోనే తండాల అభివృద్ధికీ కోట్ల రూపాయలు మంజూరు చెయ్యడమే కాకుండా ఎన్నికల వాగ్దానం మేరకు తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తూ జీ.ఓ విడుదల చేశామన్నారు.ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ సర్ దేశాయ్ ముఖ్యమంత్రి కెసియార్ తో చేసిన ఇంటర్యూను సహితం అపహాస్యం పాలు చేసిన విపక్షాలను ప్రజలే కర్రు కాల్చి వాతపేడతారని అయన హెచ్చరించారు. అయన చెప్పినట్లు గా కెసియార్ సేవలు జాతీయ స్థాయిలో అవసరం ఉందన్నారు.ఏడుపదుల అనుభవం ఉందని చెప్పుకునే వారికి దిమ్మ తిరిగేలా కెసియార్ పాలన కొనసాగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంశించారు.మూడు సంవత్సరాల ముక్కు పచ్చాలారనీ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 29 రాష్ట్రాలలో నెంబర్ ఒన్ గా నిలిచింది అంటే అది ఖచ్ఛితంగా ముఖ్యమంత్రి కెసియార్ ఘనత మత్రమే నని అయన కొనియాడారు.దశాబ్దాల తరబడి గుక్కెడు నీటి కోసం బారెడు దూరం నుండి మోస్తున్న మహిళలకు మంచినీటి గండం నుండి బయట పడేసేందుకు ఉద్దేశించబడిన మిషన్ భగీరథ కార్యక్రమం జూలై మొదటి వారంలో పూర్తి అవుతుందని అయన తెలిపారు.
తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని అసత్య ప్రచారం చేసిన వలస పాలకులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా తో సమాదానం చెప్పిన ముఖ్యమంత్రి కెసియార్, మేడిగడ్డ ను పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చెయ్యబోతున్నారన్నారు.తెలంగాణ ప్రాంతానికి మేడిగడ్డ ఓ జీవగడ్డగా మారబోతుందన్నారు.తెలంగాణ వస్తే చీకట్లో ఉంటుందని ఉద్యమం సమయంలో ప్రేలాపనలు చేసిన సీమాంద్ర నాయకుల ఏలుబడిలో అంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి ఇచ్చేది ఇప్పటికీ ఏడుగంటలే విద్యుత్ అని అయన ఎద్దేవాచేశారు.అటువంటి నేతలు అప్పుడేమో సీమాంద్ర పాలకులకు ఊడిగం చేశారని …ఇప్పుడేమో తెలంగాణ అభివృద్ధికీ మోకాలడ్డుతున్నారని అయన ఆరోపించారు.తెలంగాణలో విజ్ణత కలిగిన ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, ఇక్కడేమో పరిస్తితులు అందుకు బిన్నంగా ఉన్నాయాన్నారు.ఇక్కడి ప్రజలు అధికారపక్షం నుండే కాదు ప్రతిపక్ష స్థానం నుండి కూడ విపక్షాలను వెళ్ళగొట్టేందుకు సిద్దంగా ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు