ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మహిళలపై టీడీపీ నేతలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ( శుక్రవారం ) రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేత హరిప్రసాద్ నాయుడు అనుచరుడు, పార్టీ కార్యకర్త అయిన వెంకటకృష్ణమ నాయుడు బీజేపీ జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడి భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు.అయితే గత కొంత కాలం నుండి వీరిద్దరి మద్య వ్యాపార సంబంధ లావాదేవీలపై వివాదం నడుస్తోంది.ఈ దాడిలో హారిక మోకాలికి గాయాలయ్యాయి. ఈ మేరకు భాదితులు ఫిర్యాదు చేయగా వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
