ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురుదెబ్బ తగలనుంది.తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ డౌన్ కాబోతుంది.రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లాయని నిర్ధనకు వచ్చిన పార్టీ నేతలు…ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు.గత కొంతకాలం క్రితం టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రేవంత్ బాటలో ఖమ్మం మాజీ ఎంపీ ,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు నామానాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సిద్దమయ్యారు.తాను పార్టీ వీడే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా నామా తీసుకెళ్లారు.చంద్రబాబు కూడా ఇందుకు సానుకూలంగానే స్పందించారని సమాచారం. ఈ నేపధ్యంలో గత రెండు రోజులుగా ది నికి సంబంధించిన దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.అయితే వచ్చే 2019 ఎన్నికల్లో ఖమ్మం ఎంపిగా పోటీ చేయించేందుకు కాంగ్రెస్ ఓకే చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
