జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ యాత్ర తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ది జనసేన కాదు.. భజన సేన అని వీహెచ్ విమర్శించారు. అయితే హనుమంతరావు వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ పార్టీకే అని, ఆ పార్టీ తరఫునే నిలబడి ప్రచారం చేస్తానని అంటున్నారు
కాంగ్రెస్ పార్టీ నేతలందరి మీదా తనకు గౌరవం ఉందని… అలాగే వీహెచ్ మీద కూడా తనకు గౌరవం ఉందని.. అయితే తెలంగాణ రాష్ట్ర ఇప్పుడే ఏర్పడినది అని.. ఈ రాష్ట్రంలో అందరూ ప్రభుత్వానికి సహకరించాలని పవన్ పిలుపునిచ్చాడు. తెరాస ప్రభుత్వానికి అందరూ సహకరించాలని జనసేన అధినేత అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గనుక వీ హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తను ఆయనకు మద్దతును ఇస్తానని, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతాను అని పవన్ ప్రకటించడం విశేషం. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యల పై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.