అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పార్టీ పెడుతున్నానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్రంగానే విమర్శించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వి.హనుమంతరావు చేసిన ఆరోపణలలో ఒకటి పవన్ కళ్యాణ్ తన రెండో బార్య రేణూ దేశాయ్ ని బెదిరించారన్న వార్త బాగా హల్ చల్ చేస్తున్నది.సంస్కృతి, సంప్రదాయాల గురించి గొప్పలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ..ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలో చెబితే బాగుండేదని హనుమంతరావు విమర్శించారు.సంస్కృతి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చా?అని ప్రశ్నించారు. పవన్ అయితే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చు కాని, ఆయన విడాకులు ఇచ్చిన ఆమె మాత్రం పెళ్లి చేసుకోవద్దా?అని వి.హెచ్ నిలదీశారు. పవన్ తన రెండో భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవద్దని తన అబిమానుల ద్వారా బెదిరించింది నిజంకాదా అని వి.హెచ్ అడిగారని సూర్య పత్రిక రిపోర్టు చేసింది,.సంస్కృతిని పాలోకాని పవన్ కళ్యాణ్ సంస్కృతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వి.హెచ్ అన్నారు.
