తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఇతరుపను దూషించడం,కించపరిచేలా పోస్టులు పెట్టడం మరీ ఎక్కువైంది.దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకనుండి అలా జరగకుండా సంచలన నిర్ణయం తీసుకుంది . ఇకనుండి సోషల్ మీడియాలో ఇతరులను దూషించే విధంగా లేదా కించపరిచేలా ఏమైనా పోస్టులు పెడితే జైలుకు వెళ్లాల్సిందే.కేసు నమోదు అయిన వెంటనే కోర్టు అనుమతి లేకుండానే పిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. ఈ మేరకు ఐపిసిలో 506, 507 సెక్షన్ల కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (cognizable) విచారించదగిన నేరాలుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు.
ఈ సెక్షన్ల కింద పరుష పదజాలంతో బెదిరించడం నేరాలుగా పరిగణించబడ్డాయి. అయితే ఈ నేరాల కింద కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలా? కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలా? అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ కిందికి వస్తుంది. ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పరుష పదజాలంతో దుషించడాన్ని కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టే నేరంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు చట్టం తీసుకొస్తామని సీఎం గతంలో అనేకసార్లు హెచ్చరించారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.కాగా ఈ విషయాన్నీ నిన్న అధికారికంగా ప్రకటించారు.