ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
తాజాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లా అధికార టీడీపీ పార్టీ ఎంపీ అయిన డాక్టర్ శివప్రసాద్ కు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఘోర అవమానం జరిగింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీ శివప్రసాద్ పాల్గొనేందుకు బయలుదేరితే పోలీసులు ఎస్కార్ట్ కల్పించలేకపోవడంతో అలస్యమవ్వడంతో ఆయన వేడుకలకు హాజరుకాలేకపోయారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రిగా ,ప్రస్తుతం ఎంపీగా ఉన్న తనకు ఇప్పటికి చాలా సార్లు జిల్లాలో పోలీసులు ఎస్కార్టు కల్పించలేకపోవడంతో చాలా సార్లు అవమానాలకు గురిఅయ్యాను .
అంతే కాకుండా ఏకంగా అధికారక కార్యక్రమాలకు కూడా హాజరుకాలేక పోయను .చాలా సార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి జిల్లా ఎస్పీ స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్ళాను .కానీ ఎటువంటి ఫలితం లేకుండాపోయింది.తాజాగా ఏకంగా దళిత వ్యక్తి రచించిన రాజ్యాంగం అమల్లోకివచ్చిన సందర్భంగా జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఒక దళిత ఎంపీగా నేను పొందలేకపోయాను .ఇంతకంటే అవమానం ఇంకొకటి ఏముంటుంది అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు .