దేశవ్యాప్తంగా అన్నింటా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో మోదీ సర్కార్ ఎన్నికలకు ముందు తన అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా వదులుతోంది.. మహిళల ఓట్ల కోసమో లేదా రాజకీయ లబ్ది కోసమో కానీ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు అస్త్రాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు సంధించింది…తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో దీనిపై చర్చ జరుగుతోంది. . లోక్‌సభలో …
Read More »మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి (92) ఈరోజు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్ శాసనసభ్యుల నివాసం 272 (ఏ)లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి …
Read More »ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు:ఎంపీ రవిచంద్ర
రంజాన్ (ఈదుల్ ఫితర్) పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణలోని ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఇస్లాం శాంతి,ప్రేమ,దయ, సౌభ్రాతృత్వాన్ని బోధిస్తున్నదని, మహ్మద్ ప్రవక్త బోధనలు నాడు,నేడు, ఎల్లప్పుడూ ప్రపంచ మానవాళికి అవసరమన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారని రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లింల భద్రత, సంక్షేమం, ఉన్నతికి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గాను ప్రత్యేకంగా 206 గురుకులాలను …
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.
Read More »మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.
Read More »వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉండగా, దాన్ని 1+1కు తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి సుచరిత పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి సుచరిత స్పందించారు. తాను మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటాను. పార్టీ మారితే ఇంటికే పరిమితం అవుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ …
Read More »నెల్లూరు జిల్లా వైసీపీలో పెను దుమారం
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల వివాదం ఇంకా తీవ్రరూపం దాల్చుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీలో పెను దుమారం రేపింది. ఈ క్రమంలో ఆయన చేసిన రాజ్యాంగంపై వ్యాఖ్యల గురించి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం అని మండిపడ్డారు. వయసు …
Read More »ఏపీలో దారుణం-టీడీపీ నేతపై కాల్పులు
ఏపీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మండలాధ్యక్షుడు బాల కోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి వెళ్లిన ప్రత్యర్థులు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల్లో గాయపడిన బాలకోటిరెడ్డిని ఆయన కుటుంబసభ్యులు వెంటనే నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన జరిగిన …
Read More »