ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తులపై సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..బీజేపీ పార్టీ తమతో నడవాలి.. లేదంటే ఓ నమస్కారం పెట్టి మాదారి మేం చూసుకుంటా౦.. ఇన్నిరోజులనుండి మా వాళ్ళను కంట్రోల్ చేస్తున్న..మిత్రధర్మంవల్ల ఇంతకంటే నేను ఎక్కువగా ఏం మాట్లాడలేను అని అన్నారు.అయితే ప్రస్తుతం చంద్రబాబు అన్న ఈ వాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.కాగా చంద్రబాబు చేసిన వాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి ,బీజేపీ నేత పురందేశ్వరి వెంటనే స్పందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం సమజసం కాదని అన్నారు.టీడీపీ పార్టీ మాతో కలిసి ఉండాలనే ఉద్దేశం లేకుంటే రాష్ట్ర అద్యక్షుడు హరిబాబు తో మాట్లాడాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టె పథకాలనే టీడీపీ ప్రభుత్వం పేరు మర్చి మాదే అన్నట్లుగా చెప్పుకుంటుందని అన్నారు.అంతేకాకుండా పంచాయతీలకు కేంద్రం నిధులు నేరుగా అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.అలాగే ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.
