సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత రైతులకేనని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కరెంటు ఇవ్వమని మా నాయకుడు కేసీఆర్ మాకు చెప్పారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.ఇవాళ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి గ్రామంలో రూ.150లక్షల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా గొడుగుపల్లి చుట్టు ప్రక్కల గ్రామాలైన దీపాయంపల్లి, కొనాపూర్ లకు విద్యుత్ సరఫరా కానున్నది.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..దుబ్బాక నియోజకవర్గంలో 46వ సబ్ స్టేషన్ ఇది, ఇంకా 4 సిద్ధమవుతున్నాయన్నారు.నియోజకవర్గం పరిధిలో మొత్తం 56 విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి 2 ఊర్లకు ఒక సబ్ స్టేషన్ ఇలా మన టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మండలానికి 8 నుంచి 10 విద్యుత్ సబ్ స్టేషన్ తెచ్చుకున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడి.
see also : పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ ఘనవిజయం..!
కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల హాయాంలో యాసంగి పంటలు చేతికొచ్చేలోపు ఏదో ఒకటి కరెంటు సమస్య ఉత్పన్నమై లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోయేవని. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో లో ఓల్టేజీ సమస్య లేదు. మోటారు కాలదని మంత్రి చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చేందుకు రాత్రింబవళ్లు రాక్షసుడిలా తల్లాడుతున్నామన్నారు .రైతు కంటే మాకేమి ముఖ్యం కాదన్నారు..కానీ రైతన్నలు అవసరమైన కరెంటు వాడుకుని భూగర్భ జలాలు కాపాడాలని రైతులను కోరారు.
see also : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజీనామా..!!
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 17వేల ఎకరాలలో ఇప్పటికే 16వేల ఎకరాల భూ సేకరణ పూర్తి అయ్యిందని తెలిపారు. ఇంకా వెయ్యి ఎకరాల భూమి మిగిలి ఉంటే..దానిని అడ్డుకునే ప్రయత్నంతో వేములఘాట్ లో దీక్షల పేరిట కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతుందని..దానికి రైతు నాయకుడైన ముత్యం రెడ్డి చెప్పే మాటలు నమ్మొద్దని మంత్రి రైతులకు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఛీఫ్ విప్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ కరుణాకర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
see also : సీఎం కేసీఆర్ హర్షం..!
see also : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్‌లో దుసుకుపోతున్న కారు..!