ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో అదే నిజమయ్యేలా ఉంది. ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో స్వల్పతేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అత్యాసతో.. బాబు ఆపరేషన్ ఆకర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్రబాబు మాస్టర్ మైండ్ అని తెలుగు తమ్ముళ్లు సంకలు గుద్దుకున్నారు.
అయితే ఇప్పుడు రోజులు మారాయి.. వైసీపీ టైమ్ వచ్చింది.. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా అధికార టీడీపీకి దిమ్మతిరిగే షాకులు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే 13 జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల పై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఎల్లో గ్యాంగ్ గ్రూపు తగాదాలు.. ఇప్పుడు తాజాగా బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగినా.. టీడీపీ అధిష్టానం మాత్రం బీజేపీ పై ఒత్తిడి పెంచకుండా.. వ్యవహరిస్తున్న తీరుతో టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇలాంటి తాజా పరిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళతామని.. ప్రజల ఆవేశం కట్టలు తెచ్చుకుంటోందని.. దీంతో టీడీపీ నుండి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక టీడీపీ బ్యాయ్ మొత్తం ఎక్కువమంది అవినీతిలో కూరుకుపోయారనే విమర్శలతో పాటు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పనిచేయడం లేదన్న లోటు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటికీ తోడు ఇప్పుడు బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపడంలో టీడీపీ నేతల వైఫల్యం ఉందనే అభిప్రాయం పెరుగుతోంది. ప్రజాగ్రహం పెరగడానికి చేజేతులా బాటలు వేసుకుంటున్న టీడీపీ.. ముందుముందు మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే అనే అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. దీంతో పార్టీలోని నేతల్లో గుబులు మొదలవుతోంది. తెలుగుదేశాన్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతామేమో అనే భయం వీరిలో కలుగుతోంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ నుండి ప్రతిపక్ష వైసీపీ లోకి వలసలు మొదలైనా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే నెల్లూరులో టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి మారడం షాక్ తిన్న టీడీపీ అధిష్టానం.. టీడీపీ నుండి వరుసగా నేతలు వలసబాట పడితే ఏపీ రాజకీయాలు మరోమలు తిరగడం ఖాయమని సర్వత్రా చర్చించుకుంటున్నారు.