ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఎనిమిది రోజులకుపైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.అందులో భాగంగా ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటి చేసే అభ్యర్థిగా శ్రీదేవిని ఖరారు చేశారు జగన్ .
See Also: ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
అంతే కాకుండా టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద పోటి చేసే అభ్యర్థిగా కుప్పం వైసీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పేరును ఖరారు చేశారు.తాజాగా మరో అభ్యర్థిని ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.నిన్న వైసీపీ మాజీ నేత గౌతమ్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిశారు.ఈ సందర్భంగా జగన్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి రాధను పోతిచేయాలని ఆలోచిస్తున్నట్లు .
See Also: కడప నగరంలో సంచలనం ..టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..
ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజల్లో ఉండాలని ..రానున్న ఎన్నికల్లో గెలవడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జగన్ రాధకు తేల్చి చెప్పారు అని వైసీపీ శ్రేణులు అంటున్నారు.గత కొంతకాలంగా విజయవాడ సెంట్రల్ అభ్యర్థిపై సందిగ్ధంలో ఉన్న వైసీపీ శ్రేణులకు రాధాకృష్ణను కన్ఫర్మ్ చేస్తున్నట్లు స్వయంగా జగనే చెప్పడంతో రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసే మూడో అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగిందని రాజకీయ వర్గాలు అంటున్నారు.
See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..