టీం ఇండియా మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మరో రికార్డును సొంతం చేసుకున్నారు.సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భాగంగా మిథాలీ రాజ్ నేతృత్వంలో టీం ఇండియా ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా సోమవారం ఇరు జట్టుల మధ్య జరిగిన తొలి వన్డేలో జులన్ గోస్వామి ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లను ,శిఖా పాండే ఇరవై మూడు పరుగులిచ్చి మూడు వికెట్లను ,పూనమ్ యాదవ్ ఇరవై రెండు పరుగులిచ్చి రెండు వికెట్లను దక్కించుకోవడంతో 43.2 ఓవర్లో సఫారీ జట్టు నూట ఇరవై ఐదు పరుగులకే కుప్పకూలింది.
దీంతో మొత్తం ఎనబై ఎనిమిది పరుగుల తేడాతో టీం ఇండియా ఘనవిజయం సాధించింది.అంతకంటే ముందు ఎనిమిది పరుగులతో నాటౌట్ గా నిలిచిన జులన్ వెయ్యి పరుగుల మైళ్లను కూడా దాటింది.
దీంతో మహిళల వన్డే క్రికెట్ లో వెయ్యి పరుగులతో పాటుగా నూట యాబై వికెట్లను తీసిన ఏకైక క్రికెటర్ గా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జులన్ మొత్తం 165 వన్డేలను ఆడి తొంబై ఏడు ఇన్నింగ్స్ లో ఒక వెయ్యి మూడు పరుగులను సాధించడమే కాకుండా నూట అరవై నాలుగు ఇన్నింగ్స్ లో నూట తొంబై తొమ్మిది వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది .