ధైర్యం, దయ ఏకకాలంలో ప్రదర్శించిన సీఐకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఫిదా అయిపోయారు. ఆయన తీరును అభినందిస్తూనే నగదు బహుమతితో సత్కరించాల్సిందిగా సూచించారు. శంషాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం జరుగగా ఏడేండ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సీఐ మహేష్ తన వాహనంలో ఆ బాలుడిని దవాఖనకు తీసుకువెళ్లారు. ఆ బాలుడి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ సీఐ స్వయంగా చెల్లించారు.
see also : ఎంపీ కవిత మానవత్వానికి హ్యాట్సాప్..!
ఈ విషయం ఓ మీడియా సంస్థలో ప్రసారం కావడంతో మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేస్తూ…‘చాలా సంతోషకరం మహేష్ గారు. ఇలాంటి దయాహృదయులను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు విజ్ఞప్తి. ఇలాంటి అధికారులకు రివార్డు ఇచ్చి సత్కరించగలరు’ అని ట్వీట్ చేశారు.
??? fabulous job Mahesh Garu. Request @TelanganaDGP @CPHydCity @cpcybd to recognise the good samaritans (such as Chandan & Inayatullah and now Mahesh) by way of a reward https://t.co/ElhcRadYDf
— KTR (@KTRTRS) February 6, 2018