Home / SLIDER / ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…

ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…

తెలంగాణ అగ్నికుల క్షత్రియ కులస్తులు కమలానగర్ లోని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ని తన నివాసంలో కలిశారు. వారిని ఎంబీ సీ  ల జాబితాలో చేర్చాలని మెమోరాండంని సమర్పించారు.అనంతరం తాడూరి మాట్లాడుతూ ఎంతో వైభవంగా బ్రతికిన బీసీ  లు గత అరవై  సంవత్సరాల పాలనలో ఎంతో నష్టపోయారు .

 అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్   మనల్ని గుర్తించి ఎంబీసీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వాలంభన కై  ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం గొప్ప విషయం అని తెలిపారు.అగ్నికుల క్షత్రియులు గతంలో ఎంతో వైభవంగా బ్రతికి ప్రస్తుతం సంచార జాతులుగా మారి రోజువారీ కూలీలుగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని, అటువంటి వారిని తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

వీరి యొక్క ఆర్థికాభివృద్ధి కి కావాల్సిన సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే ఎం.బి.సి కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణాలు అందించే కార్యక్రమం ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కుల సంఘ అధ్యక్షులు వెంకటేశ్వర రావు, రామకృష్ణ, ఓంకార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma