భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఇవాళ ( గురువారం ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు.ఈ సందర్బంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రజసంకల్ప యాత్ర గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
see also : ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…
వైసీపీ పార్టీ నుండి గెలిచి అధికార టీడీపీ పార్టీ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఏపీ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతి దృష్టికి తెచ్చినట్టు చెప్పారు.రాష్ట్ర విభజన చట్టంలో అమలుకాని అంశాలను రాష్ట్రపతికి వివరించామని ఆయన తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలతో అధికార టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ బేరసారాలు చేస్తున్నారని, రూ. 25 కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో భాగంగా టీజీ వెంకటేశ్ తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేశారని, త్వరలోనే టీజీ వెంకటేశ్ బాగోతాన్ని బయటపెడతామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..
see also : పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!