ప్రస్తుతం డిగ్రీ పీజీ చదివిన కానీ ఉద్యోగం దొరకడం కష్టమవుతున్న రోజులివి.అలాంటిది ఏకంగా పదోతరగతి అర్హతతో సర్కారు నౌకరి దొరికితే అంతకంటే ఏముంది కదా .అలాంటి వాళ్ళ గురించి ఈ వార్త .అసలు విషయానికి వస్తే దేశ రైల్వే సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూపు డీ పరిధిలో ఉద్యోగాలు.వీటిన్నటికి ఆన్ లైన్లో దరఖాస్తు చేస్కోవాలి.ట్రాక్ మెన్ ,గేటు మెన్ ,పాయింట్స్ మెన్ ,హెల్పర్ ,పోర్టర్ లాంటివి గ్రూపు డీ కింద వస్తాయి.
see also : పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!
అర్హత:కొన్ని పోస్టులకు పదోతరగతి ..మిగిలినవాటికి ఐటీఏ/నేషనల్ అప్రెంటిస్ సర్టిపికేట్ ఉన్నవారు ..
వయస్సు:18-31 ఏళ్ళు (ఎస్సీ,ఎస్టీలకు ఐదేండ్లు,ఓబీసీలకు మూడేళ్ళు వయోపరిమితి ఉంటుంది )
ఎంపిక పద్ధతి : ఆన్లైన్ లో నిర్వహించే పరీక్ష ద్వారా
జీతం ఆన్లైన్ లో నిర్వహించిన పరిక్షల ద్వారా ఎంపికైన వారికీ 18 వేల రూపాయలు మూలవేతనంతో పాటు ఇతర అలవెన్సులు ..
ఫీజు :ఎస్సీ ,ఎస్టీ ,దివ్యంగులకు ,మహిళలకు 250 రూ.లు .ఇతరులకు ఐదు వందలు ..
అప్లై : ఆన్లైన్ లో
దరఖాస్తుల స్వీకరణ :ఫిబ్రవరి 10 నుండి ..ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటల నుంచి
చివరి తేది :మార్చి 12
see also : కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్