అవును, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నాపేరు సూర్య చిత్రానికి భారీ నష్టమే భారీ నష్టం వచ్చింది. అయితే, సినీ పరిశ్రమలో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తొందర పడకూడదు.. నిదానంగా ఆలోచించాలి. ఏ మాత్రం కుడిఎడమైనా కోట్లలో నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్యకూ వచ్చింది. ఇంతకీ అల్లు అర్జున్ చిత్రం అంతలా నష్టపోవల్సిన పరిస్థితి ఏమొచ్చింది అనేదానిపై ఓ లుక్కేద్దాం.
అసలు విషయానికొస్తే.. అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో మంచి మార్కెటే ఉంది. దీన్ని గమనించిన ఓ బడా సినీ సంస్థ నాపేరు సూర్య చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే 12 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ కావాలంటూ అడగడంతో నిర్మాత శ్రీధర్ లగడపాటి మరో ఆలోచన లేకుండా అమ్మేశాడట. ఆ తరువాత రిలీజైన నాపేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో మరో బడా సంస్థ నిర్మాత శ్రీధర్ లగడపాటికి డబ్బింగ్ రైట్స్ కావాలంటూ రూ.18 కోట్లు ఆఫర్ చేసిందట. తమ చిత్రానికి ఉన్న వాల్యూ తెలియక అప్పటికే బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ అమ్మేయడంతో.. 6 కోట్లు నష్టపోయామే అంటూ చిత్ర బృందం బాధపడుతోంది.