ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.అధికార పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏండ్లుగా బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము.
జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి విషయాలపై కూడా కేంద్రానికి మద్దతుగా నిలిచాము.కానీ ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపించింది.అయిన గత నాలుగు ఏండ్లుగా ప్రభుత్వం గురించి లేఖలు రాయడంతోనే రాష్ట్రానికి కేంద్ర సర్కారు అన్యాయం చేసింది.ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా మోసం చేసిందని బాబు తమ్ముళ్ళ దగ్గర వాపోయాడు.