రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిమ్మ తిరుగుతున్నదని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు అన్నారు. అందుకే నిజామాద్ జిల్లాలో ఎర్ర జొన్న రైతుల సమస్యను సాకుగా చేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.రైతుల సంక్షేమం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారన్నారు.ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదనే విషయాన్ని నిజామాబాద్ ఎంపి కవిత , ఎం.ఎల్.ఎ.లు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంతరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్ళారు.దీనిపై సి.ఎం. ఆదేశాల మేరకు మంగళవారం నాడు బి.ఆర్.కే.భవన్ లో మంత్రులు హరీష్ రావు, పోచారం , ఎం.ఎల్.ఎ.లు ప్రశాంతరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లు వ్యవసాయ, మార్కెటింగ్ ఉన్నతాధికారులతో ప్రత్యెక సమావేశం నిర్వహించారు.
ఎర్రజొన్న రైతులెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని ఇద్దరు మంత్రులు రైతులకు భరోసా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఎర్రజొన్నల ధరలు తగ్గినందున ఆ రైతులను ఆదుకోవడానికి గాను అన్ని మార్గాలను అన్వేషించాలని వ్యవసాయ శాఖ కారదర్శి పార్ధసారధి, కమిషనర్ జగన్ మోహన్, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను మంత్రులు ఆదేశించారు. త్వరితగతిన నివేదిక ఇవ్వాలని మంత్రులు పోచారం, హరీష్ రావు కోరారు.గతంలో ఆర్మూర్ లో ఎర్రజొన్న రైతుల ఆందోళన కాల్పుల దాకా వెళ్ళిందాని మంత్రి తెలిపారు. 1 2 కోట్ల బకాయిలను చెల్లించి 5 వేల మంది రైతులను మా ప్రభుత్వం ఆదుకున్నట్టు హరీష్ రావు చెప్పారు.. 2007-2008 నుంచి ఈ బకాయిల చెల్లింపులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు.ఎర్రజొన్న రైతులెవరూ కాంగ్రెస్ ఉచ్చులో పడరాదని మంత్రులు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. వారి మాయమాటలకు మోసపోవద్దని ఎర్రజొన్న రైతులకు పోచారం, హరీష్ రావు విజ్ఞప్తి చేశా రు.కరెంట్ కోతలు, విత్తనాలు, ఎరువుల కొరతలకు పర్మినెంటు కేరాఫ్అడ్రసు కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.రాష్ట్రంలోని ఏ జిల్లాలో రైతులను, సామాన్య ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారని మంత్రులు అన్నారు.
కాంగ్రెస్ హయాంలో రోజుకు కనీసం సరిగ్గా ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదన్నారు.మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవని అన్నారు. రైతుల 17వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్త్ఘు చేశారు. కాంగ్రెస్ పాలకులు పెండింగ్లో పెట్టిన ఇన్పుట్ సబ్సిడీని టీఆర్ఎస్ వచ్చిన తరువాత రైతులకు చెల్లించామని మంత్రులు పోచారం, హరీష్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రైతులు విత్తనాలు ఎరువుల కోసం పొద్దున ఐదు గంటలకే లైన్లు కట్టాల్సిన పరిస్థితి వుండేదన్నారు. ఎరువులు, విత్తనాలు పోలీసుస్టేషన్లలో పెట్టి అమ్మించారని హరీష్ రావు విమర్శించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మండల కేంద్రాలలో అందుబాటులో ఉన్న గోదాంలలో ముందుగానే విత్తనాలు, ఎరువులు భద్రపర్చి రైతులకు సకాలంలో అందిస్తున్నదన్నారు. మూడున్నర సంవత్సరాల్లోరైతులు విత్తనాలకు, ఎరువులకు ఇబ్బందిపడ్డట్లు ఒక్క వార్త కూడా రాలేదన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టడానికి కఠినంగా వ్యవహరిస్తూన్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మొక్కజొన్న, పత్తి, వరి ధాన్యం తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కారని, ధర్నాలు చేశారని మంరి హరీష్ రావు గుర్తు చేశారు.ప్రకృతి వైపరిత్యాలు, ఇతర కారణాలతో 5 లక్షల 22 వేల 486 హెక్టార్ల పంట నష్టం జరిగితే కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.. పంట నష్టపోయిన 12 లక్షల 64 వేల 565 మంది రైతులకు 480 కోట్ల 43 లక్షల రూపాయలను ఇన్ పుట్ సబ్సిడీ కింద టీఆరెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.. అందులో 455 కోట్లు చిన్న, మధ్య తరహా రైతులకు, 25 కోట్ల 45 లక్షలు మిగతా రైతులకు చెల్లించామని మంత్రి హరీష్ రావు తెలిపారు..ఇతర ప్రభుత్వాల కన్నా రైతుల కు మద్దతు ధర కల్పించడం లో తెరాస ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి తెలిపారు.2014 వరకు వరకు 4లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మిస్తే తాము మూడేండ్లలోనే రూ.1000 కోట్లు ఖర్చు చేసి 18లక్షల మెట్రిక్టన్నుల సామర్థ్యం గల గోదాంలను నిర్మించామని మార్కెటింగ్ మంత్రి తెలిపారు. రైతుల ట్రాక్టర్లపై పన్నులను, పాత బకాయిలను రద్దు చేశామన్నారు. డ్రిప్ ఇరిగేషన్కు 90శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరుశాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు.. మూసివేసిన స్ప్రింక్లర్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి 75 శాతం సబ్సిడితో అందిస్తున్నామన్నారు . వచ్చే వానాకాలం నుంచి ఎకరానికి రెండు పంటలకు ఎనిమిది వేల చొప్పున ప్రభుత్వం పంట పెట్టుబడులు ఇస్తున్నదని హరీష్ రావు తెలియజేశారు.ఇది రైతుల ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.