తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన ఈ యదార్థ సంఘటన యావత్తు అక్కడ ఉన్నవారి యొక్క ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది.అమ్మా అమ్మా అని ఎంత సేపు పిలిచిన కానీ అమ్మ లేవలేదు .పాపం పసివాడు పిలిచి పిలిచి అలచి సోలచి పోయి నిరసించి చివరికి నిద్రలో జారుకున్నాడు పసివాడు .
ఈ హృదయ విదారక సన్నివేశం ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.సమీనా సుల్తానా తన ఐదేళ్ళు వయస్సున్న పసివాడితో నగరంలో అత్తాపూర్ లో ఉంటుంది.అయితే 3 ఏళ్ల కిందటే తనను భర్త వదిలిపెట్టి పోయాడు.అయితే అప్పటి నుండి కూలో నాలో చేసి జీవనం సాగిస్తుంది.ఈ నేపథ్యంలో సుల్తానాకు గుండె సమస్య ఉండటంతో ఆదివారం తీవ్ర అనారోగ్య సమస్యకు గురికావడంతో స్థానికులు ఉస్మానియాకు చేర్చారు.
అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు.అంతలోనే ఆమె మరణించింది.దీంతో తన తల్లి చనిపోయిందని తెలియక పసివాడు అమ్మా అమ్మా అని పిలిచి పిలిచి అలసిపోయి తన తల్లి పక్కనే పడుకున్న సంఘటన ప్రస్తుతం అందరి మదిని కదిలించేస్తుంది.