ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత ,పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు హత్య చేసిన సంగతి తెల్సిందే.దీనిపై జిల్లాలో డోన్ కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ కేసులో రాష్ట్ర డిప్యూటీ సీఎం ,టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాం బాబు హస్తముందని అప్పట్లోనే వార్తలు కూడా వచ్చాయి.
అప్పట్లో నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి కూడా కేఈ కుటుంబంపైనే పలు అనుమానాలను కూడా వ్యక్తం చేసింది.అంతే కాకుండా ఏకంగా కేసు కూడా పెట్టింది.దీంతో తాజాగా డోన్ కోర్టు ఈ రోజు సంచలనాత్మక తీర్పునిచ్చింది.
ఈ కేసులో రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాం బాబుతో సహా మరో ఇద్దరు అప్పటి జెడ్పీటీసీలుగా ఉన్న టీడీపీ నేతలు కప్పెట్రాల బోజ్జమ్మ ,ఎస్సై నాగతులసీ ప్రసాద్ లను దోషులుగా ప్రకటించింది.అంతే కాకుండా వీరందర్నీ వెంటనే అరెస్ట్ చేయాలనీ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.