ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెను దుమారమే లేపిన సంగతి తెల్సిందే.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు జేఎఫ్సి సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే.ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జేఎఫ్ సీ సమావేశానికి అన్ని పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించాను.
ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన నేతల అభిప్రాయాలను తెలుసుకోవడానికి పిలిచాను తప్ప కౌగిలించుకోవడానికి కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే రాజకీయాల్లో ఎంత బద్ధ శత్రువైన సరే ఎదుటివార్ని ప్రేమతో హాగ్ చేసుకుంటారు .కానీ పవన్ కళ్యాణ్ పిలిచి మరి ఇలా అవమానించడం ఆయనకు రాజకీయం ఎలా చేయాలో తెలియదు.పద్ధతి మార్చుకోవాలని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ..