తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది.వచ్చే మార్చి ( లేదా ) ఏప్రిల్ లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత SSC ( పదో తరగతి) ఉండాలని నిర్ణయం తీసుకోనుంది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు నివేదిక అందజేశారు.
సర్పంచ్ ఎంపికకు ఇప్పటి వరకు ఎటువంటి విద్యార్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతానికి పైగా 10వ తరగతి కూడా పూర్తి చేయని సర్పంచులే ఉన్నారు. అందులో ఎక్కువ మంది నిరక్షరాశ్యులే ఉన్నారు. వారి తరపున వారి కుటుంబ సభ్యులో, లేక ఇతరులో పంచాయతీల వ్యవహారాలు చూస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. దీంతో నిధులు దుర్వినియోగం అవ్వడమే కాకుండా అభివృద్ధి కుంటుపడుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది.కాగా ఇప్పటీకే పంజాబ్, హర్యాన రాష్ట్రాల్లో సర్పంచ్ ఎన్నికలకు కనీస విద్యార్హత 10వ తరగతిని అమలు చేస్తున్నారు.