Home / MOVIES / ప్రియా ప్ర‌కాష్ చెప్పిన.. బ్యూటీ సీక్రెట్స్‌..!!

ప్రియా ప్ర‌కాష్ చెప్పిన.. బ్యూటీ సీక్రెట్స్‌..!!

చూడ‌చ‌క్క‌ని దేహ కాంతి, ఎంతో ఆక‌ర్షణీయ‌మైన జుట్టు ఇలా కేర‌ళ అమ్మాయిలు చూసేందుకు చాలా అందంగా క‌నిపిస్తారు. కేర‌ళ అమ్మాయిలు అందంలోనే కాదు.. అభిన‌యాన్ని ప‌లికించ‌డంలోనూ టాప్ అనే చెప్పుకోవ‌చ్చు. మ‌రి అందుకేనేమో బ‌హుశా..!! కేరళ నుంచే ప‌లు సినీ ఇంస్ర్టీల‌కు హీరోయిన్స్ దిగుమ‌వ‌తి అవుతుంటారు. అయితే, ఇటీవ‌ల కాలంలో న‌య‌న తార, నిత్యామీన‌న్‌, అనుపమా పరమేశ్వరన్, కీర్తి సురేష్, నివేదా థామ‌స్, మంజిమా మోహ‌న్ అలాగే, రాత్రికి రాత్రే స్టార్ అయిన ప్రియా ప్ర‌కాష్‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

అయితే, వీరి అందం వెనుక దాగి ఉన్న ర‌హ‌స్యం ఏంట‌నేది ప‌లువురికి త‌లెత్తుతున్న ప్ర‌శ్నే. ఓ సారి కేర‌ళ‌వైపు లుక్కుస్తే.. అస‌లు ర‌హ‌స్యం తెలుస్తుంది. ఇంత‌కీ వారి అందం వెనుక ఉన్న ర‌హ‌స్య‌మేంటంటే.. కొబ్బ‌రినూనె. అవును మీరు చ‌దివింది నిజ‌మే. కొబ్బ‌రి నూనె వ‌ల్ల ఆరోగ్యంతోపాటు అందం కూడా మీ సొంత‌మ‌వ‌డం ఖాయం అంటున్నారు కేర‌ళ బ్యూటీలు.

ఓసారి కొబ్బ‌రి నూనెలో ఉన్న పోష‌కాల‌ను ప‌రిశీలిస్తే..

1. ఇటీవ‌ల కాలంలో శాస్ర్త‌వేత్త‌లు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఆహార ప‌దార్థాల్లో అతిగా నూనె వాడితే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌న్న విష‌యం వెల్ల‌డైంది. అయితే, కొబ్బ‌రి నూనెను వంట‌ల్లో వాడ‌టం వ‌ల్ల 50 శాతం గుండెజ‌బ్లులు త‌ట్టే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.

2. ముఖంపై ముడ‌త‌లు, పాదం చివ‌ర్లో వ‌చ్చే ప‌గుళ్ల వ‌ద్ద‌ కొబ్బ‌రి నూనెతో మ‌సాజ్ చేస్తే వెంట‌నే త‌గ్గే అవ‌కాశం ఉంది.

3. మ‌ల్లూ హీరోయిన్ల జుట్టుపై ఓ లుక్కేస్తే.. ఆ ఒత్తుటి జ‌ట్టు చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. అలా జ్టుటు ఒత్తుదనానికి కార‌ణం కొబ్బ‌రినూనేనంటున్నారు వైద్యులు. కొబ్బ‌రి నూనెను వాడ‌టం వ‌ల్ల శిరోజాల‌కు పోష‌కాలు అందుతాయి.

4. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో కొబ్బ‌రినూనె ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందంటున్నారు వైద్యులు. అంతేకాకుండా బ‌రువు త‌గ్గేందుకు కూడా కొబ్బ‌రినూనె చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. థైరాయిడ్, ఎండోక్రైన్ గ్రంధులు సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది.

5. ఇటీవ‌ల కాలంలో ర‌సాయ‌నిక ఎరువులు వాడ‌టంతో ఆహార ప‌దార్థాల్లో పోష‌కాలు త‌గ్గి.. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా త‌గ్గిన విష‌యం తెలిసిందే. అయితే, కొబ్బ‌రి నూనెను వంట‌ల్లో వాడ‌టం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుందంటున్నారు వైద్యులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat