ప్రజలగురించి ఆలోచించే వ్యక్తి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీ ఆర్..వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..చల్లా ధర్మారెడ్డి తన సొంత పనులను పక్కన పెట్టి.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు.
ఎస్సార్‌ఎస్పీతో రెండు పంటలకు నీరు ఇవ్వబోతునట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే జూన్, జులై నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు.. కరెంట్ కోసం కష్టాలు పడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా 24 గంటల కరెంట్.. రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 8 వేల చొప్పున ఇవ్వబోతున్నామని చెప్పారు.అంతేకాకుండా రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించబోతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.