తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ఎంతో హుందాగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడం ద్వారా అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపింది . నల్గొండ ఎమ్మెల్యే , మొదటి నుండి దుందుడుకుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ సెట్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి . గవర్నర్ నరసింహన్ కు తృటిలో ప్రమాదం తప్పింది . కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ లో దాడి సమయంలో ప్రవర్తించిన విధానం చూస్తే అసహ్యం కలుగుతున్నది . రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ ను ఉద్దేశించి “ గవర్నర్ గాడు “ అని సంభోదించడమే కాకుండా బెంచీ ఎక్కి మరీ హెడ్ మైక్ ను గవర్నర్ మీదకు విసిరారు . ఆ మైక్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తగలడంతో ఆయన కంటికి తీవ్ర గాయాలయ్యాయి . వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు . గవర్నర్ నరసింహన్ కు తృటిలో ప్రమాదం తప్పింది .
see also : ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి సభానాయకుడు , గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ కి ఎంతో గౌరవాన్ని పెంచే విధంగా హుందాగా వ్యవహరించారు . ఎన్నో సంక్షేమ , అభివృద్ధి పథకాల మీద అర్ధవంతమైన చర్చ జరిగేలా ప్రోత్సహించారు . ప్రతిపక్ష పార్టీల సభ్యులకూ చర్చల్లో ఎక్కువ సమయం కేటాయించేలా సీఎం కేసీఆర్ చొరవ చూపారు . తెలంగాణ కు ప్రాణాధారమైన సాగు నీటి ప్రాజెక్టుల మీద భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు . ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ తర్వాత సాగు నీటి ప్రాజెక్టులపై చాలా మందికి అవగాహన కలిగింది . కృష్ణా , గోదావరి నదులతో పాటు తెలంగాణ లో ఉన్న చెరువులు , వాగులు వంకల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అవగాహన చూసి తెలంగాణ సమాజం ఆశ్చర్యపోయింది . సభలో ప్రతిపక్ష నేతలకు కూడా ముఖ్యమంత్రి చాలా గౌరవం ఇచ్చేవారు . ఒక్కోసారి వారు చెప్పిన సూచనల మీద కీలకమైన ప్రకటనలు కూడా చేశారు . తెలంగాణ అసెంబ్లీ నడిచే విధానం చూసి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసేవాళ్ళు . తమ అసెంబ్లీ కూడా తెలంగాణ అసెంబ్లీ లాగా హుందాగా నడిస్తే బాగుండేదని అక్కడి ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడిన దాఖలాలు చాలా ఉన్నయి .
see also :వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ హుందాతనాన్ని పెంచుతుంటే ఎంతో పాలనా అనుభవం ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు గవర్నర్ పై భౌతిక దాడికి దిగి తెలంగాణ గౌరవాన్ని మంటగలిపింది . నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గవర్నర్ మీద దాడి చేయడం ద్వారా తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలను తలదించుకునేలా చేసిండు . తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఇదొక చీకటి రోజు గా పేర్కొనక తప్పదు . వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగైదు సీట్లు కూడా రావనే భయం , ఫ్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై భౌతిక దాడికి దిగిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు . భవిష్యత్తులో మరే సభ్యుడూ ఇలా ప్రవర్తించకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం ప్రజల నుండి వినిపిస్తున్నది .