రాజ్యసభలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనూహ్య కితాబు దక్కింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోనే సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశంసించారు. ఏపీలో అలాంటిది ఊహించలేమని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఆదివారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..?
‘పలు సామాజిక వర్గాలు సామాజికంగా వెనుకబడి, ఆర్థికంగా బలంగా లేని కారణంగా ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. ఒకవేళ అన్నివర్గాలకు ప్రాధాన్యం కలిగించే అవకాశం కల్పిస్తే అలాంటి వారికి ఈ అవకాశం దక్కుతుంది. పరోక్ష ఎన్నికలు అయిన రాజ్యసభ వంటివాటిలో అలాంటి అవకాశం కల్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పలు వర్గాలకు న్యాయం జరగలేదు. అదే సామాజిక వర్గం, అదే స్థాయి ఆర్థిక స్థితిగతులు ఉన్నవారికే అవకాశం ఇచ్చారు. కానీ ఎంతో కసరత్తు చేసినట్లుగా బిల్డప్ ఇచ్చారు. స్వల్పంగా జనాభా ఉన్న కులాలు ఒక్కతాటిపైకి రావాల్సి ఉంది. సరైన పాఠం చెప్పాల్సి ఉంది. ముదిరాజులకు అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్ పార్టీకి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాంటి సామాజిక న్యాయాన్ని ఏపీలో ఊహించలేము.’ అని ఆయన పేర్కొన్నారు.
see also :టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
see also :రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!