ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయల్లోకి రావడం కొత్త ఏమి కాదు.మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీను తీసుకుంటే మహానటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పట్లో టీడీపీ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు.
ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టిన వారు అంతగా విజయవంతం కాకపోయిన కానీ ఎంపీ ,ఎమ్మెల్యేలుగా రాణిస్తున్నారు.వీరి జాబితాలోకి చేరనున్నారు ఈ రోజుల్లో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ప్రముఖ హీరోయిన్ రేష్మా .రేష్మా ఆదివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ క్రమంలో ఆమె ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తాను .ప్రజలకు సేవ చేయాలనీ ఉంది.ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా వంతు పాత్రను పోషిస్తాను.ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి తన ఎంట్రీ ఉంటుందని ఆమె కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.అయితే ఏ పార్టీలోకి చేరతారో క్లారిటీ ఇవ్వలేదు రేష్మా .