గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే దోపిడీలు, భూకబ్జాలు పెరిగిపోతాయన్నారే.. మరీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలోనే అధికంగా ఉండే భూకబ్జాలను విశాఖపట్నం వరకూ తెచ్చారు.
see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత..!
లక్ష మందికి పోలియో ఆపరేషన్లు చేసిన ఓ వైద్యుడు నాతో మాట్లాడుతూ…తన భూమి కబ్జాకు గురైందని ఆవేదన వెలుబిచ్చారు.. అంతమందికి సాయం చేసినా తన భూమిని మాత్రం కబ్జాకు గురికాకుండా కాపాడుకోలేకపోయానని బాధపడ్డారు. దళిత మహిళల భూములు తీసుకుంటున్నారు. ఇలా కబ్జాలు చేసుకుంటూ వెళ్లిపోతే ఏం కావాలి? మీ తప్పుడు విధానాలకు అంతే లేదా? రాష్ట్రంలో మీరు చేసే అవినీతి ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే విజయవాడ కనకదుర్గగుడిలోని పార్కింగ్ స్థలంలో వసూలయ్యే మొత్తంలో ఎమ్మెల్యేకు కొంత శాతం వాటా చెల్లించేంతగా. చివరకు అమ్మవారిని కూడా దోచేస్తారా అంటూ తీవ్రంగా టీడీపీ నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిబట్టి చూస్తే 2019 వైసీపీ అధికారంలోకి రావలి ..టీడీపీ వస్తే దోపిడీలు, భూకబ్జాలే జరుగుతాయని పవన్ కల్యాణ్ చెప్పినట్లే అని వైసీపీ అభిమానులు ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు.
see also..పవన్ అన్న ఆ ఒక్క మాటతో.. కాపు ఓట్లన్నీ జగన్‌కే..!!