గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగిl సంగతి తెలిసిందే. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పై దూషణలకు దిగిన తెలుగుదేశం నేతలు ఆయన సోదరుడు చిరంజీవిని కూడా కలిపి మరీ విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రశ్నిస్తాను అంటున్న పవన్ కల్యాణ్ ఆయన సోదరుడు చిరంజీవి హోదాపై రాజ్యసభలో ఎందుకు పోరాటం చేయడంలేదో ముందుగా ప్రశ్నించాలని అన్నారు. ‘ఎంతోమంది నాయకులను మోసం చేసిన చిరంజీవిని పవన్ ప్రశ్నించాలి. మీ అన్నని మీరు ప్రశ్నించకపోతే ప్రజలే కాలర్ పట్టుకుని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. లోకేశ్ అవినీతి చేశాడు అని దారుణంగా మాట్లాడుతున్న పవన్…చిన్న ఇల్లు కోసం మీకు రెండు ఎకరాలు కావాలి కానీ…రాష్ట్ర రాజధానికి ఇన్ని అవసరం లేదని అంటారా?. పవన్‌కి రాజకీయ కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఇప్పటికైనా లోకేశ్, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి’ అని ఆమె సుజాత డిమాండ్ చేశారు.
