గోబెల్స్‌కు సమానమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మరోమారు దిమ్మతిరిగిపోయే కౌంటర్ వచ్చింది. `వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ కిషోర్ పైనే ఆధారపడ్డాయి` అంటూ కర్త, కర్మ,క్రియా అంతా తానే అయి టీడీపీ చేసిన ప్రచారంలో నిజం లేదని తేలింది.
see also :ఏపీ మంత్రి కోల్లు రవీంద్రకు ప్రమాదం ..!
ఈ రోజుల ఉదయం నుంచి పచ్చ బ్యాచ్ ప్రచారం, వారి అనుకూల మీడియాలో హోరెత్తించే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. `ఏపీ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాసంలో జరిగిన భేటీకి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఏపీలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్… బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయ్యారు. ఈ భేటీకి హాజరైన ప్రశాంత్ కిషోర్… ఏపీలో పార్టీ పరిస్థితులపై వివరించి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో పొత్తుకు లైన్ క్లియర్ చేశారు` అని దీనిపై పీకే టీం క్లారిటీ ఇచ్చింది
see also :ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ పచ్చ టీవీ ఛానల్ క్లిప్‌ను జతచేస్తూ మరీ…`పూర్తిగా అవాస్తవ కథనం. అసత్యకథనాలను ప్రచారం చేసేందుకు దురుద్దేశపూరితంగా చేస్తున్న ప్రచారం ఇది. ఇలాంటి ప్రచారం గురించి వదిలేయండి. ఎందుకంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు` అంటూ తేల్చిచెప్పింది.అంతేకాకుండా బీజేపీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించడం కూడా పూర్తిగా అబద్దమని పేర్కొంది.ఎల్లో మీడియా పెట్టిన టైటిల్ కింది బొమ్మలో గమనించండి .దిని బట్టి మనకు అర్ధమవుతుంది ఏమిటంటే జగన్ పై ఎల్లో మీడియా విషప్రచారం అని..
see also :అమ్మాయిలను బుక్ చేసుకునే నువ్వెంత..! నీ బతుకెంత..!!